జూలై 27న వంచుల స్వర్ణ సచివాలయంలో పీజీఆర్ఎస్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 25:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 27న వంచుల స్వర్ణ గ్రామ సచివాలయంలో నిర్వహించనున్నట్లు జీకేవీధి ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.