టూరిస్ట్ బస్సు, డీసీఎం ఢీ.. ఒకరి మృతి
ఖమ్మం, పెన్ పవర్, జూలై 21: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డులో, ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన డీసీఎం వ్యాన్ ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టూరిస్ట్ బస్సు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయింది. డీసీఎంలో...