తప్పిపోయిన బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు

సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగింత నర్సీపట్నం, పెన్ పవర్ : మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ బాలిక కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించి బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సెల్‌ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్‌లు, సీసీటీవీ-360, ఐటీ...