తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించిన ఏకలవ్య పాఠశాల

క్రమశిక్షణే విద్యార్థుల విజయానికి పునాది – అతిథులు టాపర్లకు సన్మానం.. పాఠశాల అభివృద్ధికి రూ.50 వేల విరాళం చింతపల్లి, పెన్ పవర్, జూలై 24:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్' కార్యక్రమం శుక్రవారం చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా జరిగింది. పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషా...