త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలి

గార్ల పెన్ పవర్ జులై 20: గ్రామ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులు, కేసు దర్యాప్తు ఫైళ్లు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ, మాల్ఖానా, రిసెప్షన్, రికార్డు నిర్వహణ తదితర...