ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం
గార్ల, పెన్ పవర్, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత విప్లవాత్మక పోరాటాల చారిత్రాత్మక విజయమని బిఆర్ఎస్ పార్టీ గార్ల మండల మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ అభివర్ణించారు.ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చూసిన కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిణామం చెంపపెట్టుఅని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర రాజీనామాతో గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించిందని తెలిపారు. గతంలో కెసిఆర్ స్పష్టం చేసినట్లుగా ఇండియా రియాక్ట్స్ అనే నిజానికి ప్రతిరూపంగా నేడు వెలువెత్తిన ఉద్యమం...