నర్సీపట్నంలో డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్
రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో రిజిస్ట్రేషన్ దస్తావేజు లేఖరులు సోమవారం పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించి ఐదు రోడ్ల జంక్షన్ లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షుడు సున్నం చిదంబరం స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్ల అధ్యక్షులు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల భద్రత,...