నర్సీపట్నం మున్సిపాలిటీలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’

రూ.50 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. రూ.16.30 లక్షల పనులకు శంకుస్థాపన నర్సీపట్నం, జూలై 26 (పెన్ పవర్): నర్సీపట్నం పట్టణంలోని 26, 28వ వార్డుల్లో శనివారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టిడిపి పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముందుగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...