పందుల స్వైరవిహారం పట్టించుకోని అధికారులు
గార్ల, పెన్ పవర్, జులై28: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు పంది పిల్లలతో కలిసిరోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పందుల పెంపకందారులు పందులను బయటకు వదిలి వేయడంతోఇంటి పెరటిలో ఉన్న ఆకుకూరలు, పూల మొక్కలను పాడుచేస్తూ పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి చేష్టలతో మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారుపలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోడం లేదని గ్రామస్తులు...