పాలిటెక్నిక్ కళాశాలలో ‘అభయ’ అవగాహన కార్యక్రమం
నర్సీపట్నం, జూలై 27 (పెన్ పవర్): అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం చేపట్టిన "అభయ – మీ భద్రత... మా బాధ్యత" కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ఎస్.ఐ జి. ఉమా మహేశ్వరరావు విద్యార్థులకు మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్...