పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: జీకే వీధి ఎస్సై సురేష్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, జూలై 24: పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి ప్రత్యేక శ్రద్ధ చూపాలని గూడెంకొత్తవీధి ఎస్సై సురేష్ పిలుపునిచ్చారు. మండలంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం)లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థుల చదువు, ప్రవర్తన, స్నేహితుల వాతావరణంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని, ఉన్నత...