పుట్టినరోజున అనాథ బాలికకు అండగా నిలిచిన జనసేన నేత
తక్షణ ఆర్థిక సాయం అందజేత • చదువు, బాగోగుల బాధ్యత స్వీకరణ • చింతపల్లి బాల సదనంలో పరామర్శ చింతపల్లి, జూలై 7 (పెన్ పవర్):“మానవ సేవే మాధవ సేవ” అన్న మాటను కార్యరూపంలో చూపిస్తూ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం తన పుట్టినరోజును వినూత్నంగా సేవా కార్యక్రమంగా జరుపుకున్నారు. వేడుకలకు పరిమితం కాకుండా, చింతపల్లి బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ అనాథ బాలికకు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు.జీకే వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు...