పేదరికాన్ని జయించి ఉన్నతాధికారిగా ఎదిగిన కుడుముల వెంకటేశ్వరరావు
వెంకటేశ్వరరావు జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం ఘనంగా పదవి విరమణ కార్యక్రమం చింతపల్లి,పెన్ పవర్,జూలై1: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి చెందిన కుడుముల వెంకటేశ్వరరావు సాధారణ కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి, తన కృషి, పట్టుదలతో పోలీసు శాఖలో విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన జీవిత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.1966 జనవరి 1న జన్మించిన వెంకటేశ్వరరావు ప్రాథమిక విద్యను లమ్మసింగిలో పూర్తి చేసి, అనంతరం ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే...