బడి తెరిచినా విద్యార్థులకు అందని కిట్లు.. కూటమి పాలనలో విద్యార్థుల తడ’బాటు’!

పేరు మార్చడంపైనే శ్రద్ధ.. కిట్ల పంపిణీలో నిర్లక్ష్యమని విమర్శ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూలై 2: రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలు దాటినా విద్యార్థులకు అందాల్సిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో అమలైన 'జగనన్న విద్యా కానుక' పథకానికి పేరు మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని, కానీ విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, యూనిఫాం వస్త్రాలు,...