బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
గార్ల పెన్ పవర్ జులై 23: బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు.ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం గార్ల మండల కేంద్రంలోని ఆశ్రమ నిర్మలా హై స్కూల్ లోని 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ టీకాలు అందజేశారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ హనుమంతరావు, వ్యాక్సిన్ ప్రాధాన్యంపై విద్యార్థినులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి మాట్లాడారు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో...