బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం:డాక్టర్ రోజి వినీతాంజలి
సీజనల్ వ్యాధుల నివారణతో పాటు హెచ్‌పీవీ టీకాపై అవగాహన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 24:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని కేజీబీవీ, ఏపీఆర్ బాలికల పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ఆర్‌వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. రోజి వినీతాంజలి పాల్గొని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు ఆరోగ్య పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థినులు అనారోగ్యానికి గురైనప్పుడు స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని సూచించారు. పసరు మందులు, చెక్క మందులు వంటి...