భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
గార్ల, పెన్ పవర్, జూలై 25: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల వ్యాప్తంగా ఆషాఢ మాసం తొలి ఏకాదశి (శయన ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు ఆయా వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మండలంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మండల కేంద్రంలోని స్థానిక జెండా బజార్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అచ్యుత్ చార్య స్వామి అమ్మవార్లకు విశేష...