మండల సర్వసభ్య సమావేశంలో బ్యాక్సైట్, 1/70 చట్టాలపై తీర్మానం 

గిరిజన హక్కుల పరిరక్షణకు అధికారిక తీర్మానం చేయాలని డిమాండ్ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 2: అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల సర్వసభ్య సమావేశం బుధవారం బ్యాక్సైట్ తవ్వకాలు, 1/70 చట్టం అమలు అంశాలపై తీవ్ర చర్చకు వేదికైంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూహక్కులను పరిరక్షించే 1/70 చట్టాన్ని పునరుద్ధరించి పూర్తిస్థాయిలో అమలు చేయాలని, బ్యాక్సైట్ తవ్వకాలకు సంబంధించి నమూనాల సేకరణ ఏ అధికారుల అనుమతితో జరిగిందో స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.అడవుల్లో గుట్టుచప్పుడు కాకుండా బ్యాక్సైట్ నమూనాల సేకరణ జరగడం...