మాజీ ఎమ్మెల్యే గణేష్ అసత్య ఆరోపణలు చేశారు

సి సి ఫుటేజ్ బయట పెట్టిన డి ఎస్ పి శ్రీనివాసరావు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావుపై శనివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణలన్నీ సత్య దూరమని డిఎస్పి శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రూరల్ ఎస్సై రాజారావు నిజాయితీపరుడని, అన్యాయంగా అతనిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అప్పన్నపాలెంకు చెందిన సుర్ల నూకరాజుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను చూపిస్తామని, అనుమానాలు ఉంటే...