ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
గార్ల, పెన్ పవర్, జూలై 25: గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. గత ఐదు రోజులుగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక లో మండలంలోని 20 గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న వార్డు సభ్యులందరికీ శిక్షణ పత్రాలను ఎంపీడీవో మంగమ్మ అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పారదర్శక...