ముద్రగడ పాడె మోసిన జగన్.. ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు
కాకినాడ జిల్లా పెన్ పవర్ ప్రతినిధి,జూలై 15: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించడం విశేషంగా నిలిచింది.ముద్రగడతో తనకున్న ఆత్మీయ అనుబంధానికి నిదర్శనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆయన పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ దృశ్యం అక్కడికి...