రాజస్థాన్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్
చింతూరు, పెన్ పవర్ జూలై 30: చింతూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చింతూరు ఎస్‌ఐ ఎం. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలు, అనుమానితులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన రాహుల్ సైన్ మరియు జై సింగల్ అనే...