రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
గార్ల, పెన్ పవర్, జులై 25: రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గార్ల మండలానికి చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ సూత్రపు జయశంకర్ తెలిపారు. ఈనెల 19న మహబూబాబాద్ లో జరిగిన బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ జిల్లాస్థాయి సెలక్షన్ లో గార్ల మండల బాస్కెట్ బాల్ అసోసియేషన్ నుండి సబ్ జూనియర్ క్రీడాకారులు చందా వినీత్ మహమ్మద్ అద్నాన్ వల్లపు దాసు హారిక తోడేటి అంజలి కాముని అనుజ చికృత దువతార నందన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు...