రాహుల్ గాంధీ అరెస్ట్ బిజెపి నియంతృత్వానికి నిదర్శనం

గార్ల, పెన్ పవర్, జులై 22: ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం బిజెపి పార్టీ నియంతృత్వానికి నిదర్శనమని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో నిర్వహించిన ధర్నాలో గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తో కలిసి రోడ్డుపై బైఠాయించి...