రైతు ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు

  గార్ల, పెన్ పవర్, జులై 27: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండేందుకు వారి ముంగిట్లోకే నాణ్యమైన విత్తనాలను అందజేస్తుందని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల వ్యవసాయ అధికారి రామారావు తో కలిసి రాయితీపై రైతులకు కంది పెసర మినుముల...