విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ, ధర్నా నర్సీపట్నం, పెన్ పవర్ : విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచాలని, పీజీ విద్యార్థులకు సంబంధించిన జీవో...