సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి:డీఆర్‌వోకు వినతిపత్రం..
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 30:ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గురువారం డిమాండ్ చేశారు.రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాడేరు ఐటీడీఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్‌వోకు వినతిపత్రాన్ని...