సోకులేరు వాగు ఘటనకు విషాద ముగింపు. ఇద్దరి మృతదేహాలు లభ్యం

చింతూరు, పెన్ పవర్ జూలై 30: చడలవాడ పంచాయతీ పరిధిలోని సోకులేరు వాగులో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. మృతులు పెండెం బాబి, పెండెం కళ్యాణ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 28న సోకులేరు వ్యూ పాయింట్ సమీపంలో జరిగిన ఘటన అనంతరం, చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. గోపాలకృష్ణ పర్యవేక్షణలో మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఏఎన్‌ఎస్ బృందం, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు కలిసి గత రెండు...