1/70 చట్ట పరిరక్షణకు దుచ్చరపాలెం గ్రామస్తుల ‘లక్ష’ విరాళం

గిరిజన హక్కుల కోసం ఏకతాటిపై గ్రామం  ఉద్యమానికి ఆర్థిక అండగా ప్రజల స్వచ్ఛంద సహకారం గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 11: గిరిజన ప్రాంతాల భూములు, హక్కులను కాపాడే చారిత్రాత్మక 1/70 భూ బదలాయింపు నిరోధక చట్టం పరిరక్షణ కోసం దుచ్చరపాలెం గ్రామస్తులు విశేష ఐకమత్యాన్ని చాటారు. చట్టాన్ని రక్షించుకోవడం ప్రతి గిరిజనుడి బాధ్యత అనే సంకల్పంతో గ్రామంలోని ఆదివాసీలు, యువత, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళాన్ని సేకరించి అందజేయడానికి సిద్ధమయ్యారు.ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా...