ABM జూనియర్ కాలేజీలో ‘అభయ’ అవగాహన కార్యక్రమం
నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న "అభయ – మీ భద్రత... మా బాధ్యత" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎ బి ఎమ్ జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ షేక్ గఫూర్ పాల్గొని విద్యార్థినులు, విద్యార్థులకు మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల నివారణ, మహిళలు...