అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 4 :స్థానిక గోకవరం రోడ్డులోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో జగ్గంపేట క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అప్పలరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "అల్లూరి సీతారామరాజు అంటే తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక. కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రలేకుండా...