కలెక్టరేట్‌లో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి. గోవిందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని...