ఆర్కే బీచ్‌లో మరోసారి తృటిలో తప్పిన ప్రమాదం
సకాలంలో స్పందించిన లైఫ్ గార్డ్.. ప్రాణాలతో బయటపడిన తెలంగాణ పర్యాటకురాలు విశాఖ దక్షిణం, పెన్ పవర్ జూలై 19: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం మరోసారి ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు సముద్రంలో స్నానానికి దిగగా, అలల ఉద్ధృతి కారణంగా వారిలో సుజాత (56) అనే మహిళ సముద్ర కెరటాల దాటికి కొంత దూరం కొట్టుకుపోయింది. మహిళ ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన బీచ్ లైఫ్ గార్డ్ ఎం. ధనరాజు వెంటనే అప్రమత్తమై సముద్రంలోకి దిగి సాహసోపేతంగా ఆమెను...