అల్లూరి స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి: సీపీఐ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం బీచ్ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్.కే. రహిమాన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకుల చర్యలను అల్లూరి స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు....