అల్లూరికి ఘన నివాళులర్పించిన ఏపీఈపీడీసీఎల్ అధికారులు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 04: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత విప్లవ వీరుడని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ...