విశాఖలో విజయవంతంగా విద్యాసంస్థల బంద్
విశాఖలో విజయవంతంగా విద్యాసంస్థల బంద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 24: న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద "ఛలో పార్లమెంట్" కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు విశాఖపట్నంలో విశేష స్పందన లభించింది. ...