భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విశాఖపట్నం, జూలై 24: యువత భవిష్యత్తు, విద్యా రంగ అభివృద్ధే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు అమలయ్యాయని, కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాల...