కేజీహెచ్ నుండి వృద్ధుడు అదృశ్యం

విశాఖపట్నం, పెన్ పవర్ జూలై 3 : నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్‌) నుంచి చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్త సురవరం గ్రామానికి చెందిన అదప అప్పారావు (70) ఈ నెల 22వ తేదీ సాయంత్రం కేజీహెచ్‌ ప్రాంగణం నుంచి కనిపించకుండా పోయినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, అదృశ్యమైన సమయంలో అప్పారావు లైట్‌ గ్రీన్‌ రంగు హాఫ్‌హ్యాండ్స్‌ షర్ట్‌, బ్లూ కలర్...