భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్ష

  భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్ష   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ పెందుర్తి, జూలై 31 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో శుక్రవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...