గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శ

  ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 5: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఘటన జరిగిన రాత్రి నుంచే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, నేవీ అధికారులు,...