ప్రైవేటీకరణ వద్దు – జాతీయీకరణ ముద్దు

పేదలు, దళితులకు భూ పంపిణీ చేసి రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలి దళిత విముక్తి ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ, బహిరంగ సభ విశాఖపట్నం, జూలై 2 (పెన్ పవర్): ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి జాతీయీకరణ విధానాన్ని అమలు చేయాలని, పేదలు, దళితులకు భూములు పంపిణీ చేసి రిజర్వేషన్లను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత విముక్తి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. డాబాగార్డెన్స్‌లోని ఎల్‌ఐసీ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం...