గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి
– ప్రభుత్వం వేగంగా స్పందించాలని - కేకే రాజు డిమాండ్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు.సాంకేతిక కారణాలతో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు...