భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం విజయవంతం కావాలని కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం విజయవంతం కావాలని కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     విశాఖపట్నం, జులై 29 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం విజయవంతంగా జరగడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మరింత అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షిస్తూ విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో జరగనున్న విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి...