దశాబ్దంగా దుస్థితిలో కుసుమరాయి– కొమరవరం రహదారి
రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల ఆందోళన గంగవరం, పెన్ పవర్, జూలై 15: పోలవరం జిల్లా గంగవరం మండలంలోని కుసుమరాయి–కొమరవరం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కుసుమరాయి గ్రామానికి చెందిన సుమారు వంద మంది గ్రామస్తులు బుధవారం రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి అత్యంత కీలకమైన ఈ రహదారి దాదాపు పదేళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉండటంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామస్తుల కథనం...