పేదల సేవలో రాజీ లేదు: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, జూలై 1: పేదల సేవలో ఎలాంటి రాజీ ప్రసక్తే లేదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. బుధవారం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,711.79 కోట్లతో 62,19,648 మంది లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందిస్తోందని ఆమె తెలిపారు. ఇటీవల కొత్తగా మంజూరైన 7,792 స్పౌజ్ పింఛన్లను కూడా...