“వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్”

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్" (విబి జీ రామ్ జీ) పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో ఘనంగా జరిగింది. డ్వామా పీడీ ఎస్.మధుసుధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై, గ్రామంలోని నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ...