అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ బోనాలు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 26: ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ నగర్ బజార్ వాసులు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించుకుని బోనాలను నెత్తిన ఎత్తుకుని మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య గార్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా పౌర సరఫరాల గిడ్డంగి గోదాం వద్ద ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరసారెలు సమర్పించి మొక్కులు...