అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అంగన్‌వాడీ టీచర్‌కు పరామర్శ
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడిన డా. లక్ష్మణరావు గూడెం కొత్తవీధి, పెన్ పవర్, ఆగష్టు 2:విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ మాడుగుల అన్నపూర్ణను ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్నపూర్ణకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేజీహెచ్‌లోని సంబంధిత వైద్యులతో డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడారు. అవసరమైన...