ఆత్మగౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న
గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 18: అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పాపన్న సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులు తోడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ బహుజన వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతిని పురస్కరించుకొని గార్ల కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో గల అమరవీరుల స్తూపం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పాపన్న గౌడ్...