కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తికకు ఉత్తమ వాలంటీర్ అవార్డు
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 1:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన పాండు కరాటే అకాడమీ కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తికకు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో “ఉత్తమ వాలంటీర్” అవార్డు లభించింది.వైజాగ్ వాలంటీర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థలోని పునర్వినియోగం విభాగంలో దీప్తిక అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న దీప్తికను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ సెన్సై...